calender_icon.png 7 July, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీవీఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

06-07-2025 06:37:34 PM

సూర్యాపేట (విజయక్రాంతి): టీవీఏసి జేఏసీ నిరవధిక సమ్మె గోడ పోస్టర్ ను టీవీఏసి జేఏసీ సూర్యాపేట జిల్లా చైర్మన్ మేడే మారయ్య(District Chairman Mede Maraiah) ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యూనియన్లకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు యూనియన్లకు అతీతంగా జూలై 14వ తేదీ నుండి సమ్మెలో పాల్గొనాలని కోరారు. అలాగే ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని విమర్శించారు. స్టాండింగ్ ఆర్డర్స్ ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కన్వర్షన్ అనేది ఉద్యోగ భద్రత, ఆత్మ గౌరవనికి సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్ అని పేర్కొంటూ జూలై 14 తేదీ నుండి విధులను బహిష్కరించి ముక్తకంఠంతో సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ చైర్మన్ రెహమాన్, కన్వీనర్ దయాకర్ రెడ్డి, కన్వీనర్ మురహరి, ట్రాన్స్కో బండి నరేష్ గౌడ్, రామారావు, గోపి, సైదులు తదితరులు పాల్గొన్నారు.