07-11-2025 07:09:51 PM
ప్రజా ప్రతినిధులకు భయం.
హలో మాజీ జడ్పిటిసి, ఎంపీటీసీ, గారు మీ ఊర్లో సర్వే చేస్తున్నాం.
ఈసారి కష్టపడితే మీ దగ్గర గెలుపు మాజీ ప్రజాప్రతినిధికి ఫోన్ కాల్స్..
మల్యాల,(విజయక్రాంతి): హలో అన్న ఈసారి మీకు గ్యారెంటీ? అంటూ గతంలో బర్రిలో దిగి ఓడిపోయిన అవతలి వ్యక్తికి భరోసా... సార్ రిజర్వేషన్ అనుకూలిస్తే మీరే బరిలో దిగండి. సార్.. గెలుపు పక్క సార్. యువ నాయకుడికి ఫోన్లో అపరిచితుడు అభయం. ఇలా కొన్ని రోజులుగా సర్పంచ్, ఎం పి టి సి, జడ్పిటిసి, స్థానాల కోసం ఆశావులకు సర్వేల పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అబ్బో నా గురించి బరీలో సర్వే చేశారంటూ అయితే బరిలో దిగవలసిందే అంటూ లో లోపల ఆ నాయకుడు సంబరపడుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామాల్లో సందడి పండగ వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కొందరు నాయకులు సర్వే చూపిస్తున్నారు. పార్టీల్లో స్థానికంగా ఆర్థికంగా ఉన్న వారిని ఆశావాహు లు గతంలో ఓటమి పాలైన వారు గురించి ఆలోచిస్తున్నారు. నంబర్లు సేకరించి ఫోన్ చేస్తున్నారు.
తమ సంస్థ సర్వే ఫలితాలు కచ్చితంగా ఉంటాయని. నమ్మబల్కుతున్నారు. తమరు ఈ వార్డులో. ఈ గ్రామంలో, ఈ మండల కేంద్రంలో మంచిగా చేసుకోండి అంటూ సలహాలు సూచనలు చేస్తున్నారు, నిజమే అనుకోని నాయకులు నమ్ముతున్నారు. ఎన్నికలు జరిగే వరకు సర్వే నిర్వహిస్తామని, తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని 10. వేల నుంచి 25 వేల వరకు చెల్లించవలసి ఉంటుందని చెప్తున్నారు. ఇదేదో మోసమని కొందరు ఫోన్ పెట్టేయగా, మరికొందరు పదవులులపై ఆశతో నమ్మి చేతి సమరు పోగొడుతున్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సయెనక ముందే బురిడీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆశా ఆహ్లాహులా రా తస్మాత్ జాగ్రత్త.