07-11-2025 07:03:22 PM
నకిరేకల్,(విజయక్రాంతి): గ్రూప్-1 ద్వారా ఎంపికైన ట్రైని డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్ శాలిగౌరారం మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం పరిశీలించారు. జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ హైస్కూల్‌లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, అంగన్వాడీ కేంద్రం, భవిత కేంద్రం కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈజీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఎంఈఓ మందుల సైదులు, ఏపీవో జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.