6 March, 2026 | 7:56 AM

కాలనీల్లో పందుల స్వైర విహారం

06-03-2026 02:01 AM

హనుమకొండ టౌన్, మార్చి 5 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల్లో పందులు స్త్వ్రర విహారం చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయని ప్రజలు చెబు తున్నారు. మురుగు కాలువలు, రోడ్లపై గుం పులుగా సంచరిస్తున్నాయని, పందులు చిన్నపిల్లల వెంట పడడం, రోడ్లపైకి ఆకస్మాత్తుగా అడ్డు రావడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

పందులు విచ్చలవిడిగా తిరగడం వలన డెంగ్యూ విషజ్వరాలు వ్యాప్తి చెందడం పట్ల, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పందుల నిర్మూలనకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, పెంపకం దారులు బాధ్యతార హిత్యంతో ఇస్టారీతిగా కాలనీలలో తిరుగుతున్నాయని, అందుల వల్ల రోజు రోజుకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పలు కాలనీల్లోనీ ప్రధాన వీధుల్లో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వీటి సంఖ్య రోజుకు పెరిగిపోతు న్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.

పందుల పెంపకం దారులు నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య పందులను పెంచుతున్నారని ప్రజలు తెలుపుతున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తిన తీరుగా వ్యవహరిస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. జనావా సాల్లో పందుల పెంపకాన్ని నిషేధించాలని, పందులను పట్టణ శివార్లకు తరలించాలని, పందుల పెంపకం చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పందుల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

తాళ్లపల్లి విజయ్ కుమార్

మురుగునీటి, చెత్త కుప్పలో తిరిగే పందుల వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అంతే కాకుండా పందులు రోడ్లపై కి రావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. పందులతో తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదు. నిబంధనకు విరుద్ధంగా పందులను పెంచుతున్నారని, అధికారులు వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరారు.