calender_icon.png 27 November, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్‌పల్లిలో పిస్తా హౌజ్ ప్రారంభం

27-11-2025 12:03:44 AM

ప్రారంభించిన ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రాంమోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి  

శంకర్ పల్లి, నవంబర్ 26 : బుధవారం శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ ను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పిస్తా హౌస్ ఫౌండర్ ఎండీ అబ్దుల్ మజీద్‌తొ కలిసి ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సంద ర్బంగా యాదయ్య మాట్లాడుతు.. రోజు రోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న శంకరపల్లి పట్టణంలో అంతర్జాతీయంగా పేరున్న సంస్థలు ముందుకు రావడం అభిందయం అని అన్నారు.

ఈ సందర్బంగా పిస్తా హౌస్ శంకర్ పల్లి బ్రాంచ్ ఏర్పాటు చేసిన క్రిష్ణ రెడ్డి, అభినవ్ రెడ్డి, నితీష్ రెడ్డి, రాకేష్ లకు అభినందనలు తెలిపారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో శాఖలు ఉన్న పిస్తా హౌస్ తమ నూతన బ్రాంచ్ శంకర్ పల్లిలో ఏర్పాటు చేయటం గొప్ప విషయం అన్నారు. శంకర్‌పల్లి ప్రాంతంలో ఇప్పటికే బ్రాండెడ్ షాప్‌లతో పాటు అనేక సంస్థలు వస్తున్నాయని అన్నారు. పిస్తా హౌస్ హలీంకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని గుర్తు చేశారు.

ఈ కార్యక్ర మంలో శంకర్ పల్లి మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కాశెట్టి చంద్రమోహన్, సోసైటీ చేర్మెన్ బద్దం శశిధర్ రెడ్డి,మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజె, అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమౌళి, నరసింహ్మ రెడ్డి, లింగారెడ్డి, మైనారిటీ నాయకులు రఫీయొద్దీన్, బాబా వసియొద్దీన్, సమీయొద్దీన్, ఫసియొద్దీన్, రజాక్ పాల్గొన్నారు.