calender_icon.png 13 January, 2026 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజల ఆత్మబంధువు పీజేఆర్

13-01-2026 02:39:32 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ 

జూబ్లీహిల్స్, జనవరి12 (విజయక్రాంతి): దివంగత పి.జనార్దన్ రెడ్డి (పిజెఆర్) పేద ప్రజల ఆత్మబంధువు అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.పిజెఆర్ జయంతిని యూసుఫ్ గూడ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యే పిజెఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సంద ర్భంగా మాట్లాడుతూ కార్మిక నేతగా ఎంతో మంది జీవితాల్లో పిజెఆర్ వెలుగులు నింపారన్నారు.బడుగు,బలహీన వర్గాలకు చెందిన ప్రజల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం పోరాడారన్నారు.అటువంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం, ప్రజల కోసం ఆయన చూపిన బాటలో పని చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పిజెఆర్ అభిమానులు తదితరులున్నారు.