calender_icon.png 20 November, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాదాబైనామా అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

20-11-2025 12:44:24 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, నవంబర్ 19 : (విజయ క్రాంతి): భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల  పరిష్కారంలో ఆయా మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు.

పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సాదాబైనామా అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఇదిలాఉండగా, విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం యూడైస్‌లో ప్రతి విద్యార్థి వివరాలను నమోదు చేయిస్తుందని, ఈ నేపథ్యంలో అవసరమైన విద్యార్థులకు జనన ధృవీకరణ, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను వెంటవెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల మ్యాపింగ్‌ను తప్పిదాల కు తావులేకుండా సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. సబ్‌కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు.