23-05-2025 02:07:39 AM
జగిత్యాల, మే 22 (విజయక్రాంతి): జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో పిడుగుపాటుతో ఆంజనేయస్వామి ఆలయం దెబ్బతిన్నది. తుఫాన్ మూలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో భాగంగా గురువారం ఉదయం పిడుగు పడింది. సరిగ్గా దేవాలయ శిఖరంపైనే పిడుగు పడటంతో శిఖరం పగుళ్లు చూపింది.