10-09-2025 08:18:16 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి..
జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: నిజాం నిరంకుశత్వ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి అన్నారు. జాజిరెడ్డిగూడెం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరికో ప్రేరణగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున, ఉప్పెనల ఎగిసిపడేలా చేసిన చాకలి ఐలమ్మకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాటిపాముల జలేంధర్,పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్,రజక సంఘం నాయకులు తాడూరి ఆంజనేయులు,గిరిబాబు,శ్రీకాంత్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.