10-10-2025 12:41:32 AM
మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి కన్వీనర్ మోర శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 9(విజయక్రాంతి): సిరిసిల్ల మార్కండేయ అత్యంత పు రాతనమైన విశిష్టమైన శివభక్త మార్కండే య స్వామిదేవాలయము పునర్నిర్మాణం మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి ఒక కార్యచరణను ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రెస్ క్లబ్లో శ్రీనివాస్ మా ట్లాడుతూ.
గత రెండు నెలల నుండే పద్మశాలి కుల బంధువులతో, హిందు బంధువు లతో సమాజంలోని అందరిని కలుపుకుని పోయే విధంగా దేవాలయాల ఆధారంగా 22 సమావేశాలను శాంతి నగర్ ’నుండి భూ పతినగర్’ వరకు, చంద్రంపేట నుండి సాయినగర్ వరకు నిర్వహించి అభిప్రాయాలను సేకరించింది. దేవాలయ పునర్నిర్మాణం హిందూ సంఘటనా శక్తికి, ఆత్మ గౌరవానికి, సమరసతకు చిహ్నంగా లలితా పరమేశ్వరీ లక్ష్మీనారాయణ సహిత శివభక్త మార్కండే య స్వామి దేవాలయాన్ని పునర్నిర్మా ణము లో సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరినీ భాగస్వామ్యం చేయాలని భావిం చి అందుకు నిధి సమర్పణ కార్యాచరణను ప్రారంభించి తెలియజేశారు.అభిప్రాయాల ను సేకరించింది.ఈ సమావేశం ద్వారా ము ఖ్యంగా తెలియజేయడం ఏమనగా అతి త్వరలోనే దేవాలయ నిధి సమర్పణ కార్యా చరణను ప్రారంభం.
చేస్తున్నామని అది కూడా వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా ము.ఇటీవల అయోధ్య లో భవ్యమైన దిన్యమైన అయోధ్య రామమందిర నిర్మాణముకై జరిపిన నిధి సమర్పణ కార్య విధానమే స్ఫూర్తిగా తీసుకుని సామాన్యుడి నుండి సం పన్నుడి వరకు అందరం దేవుడి ముందర సమానమే అనే భావనతో ప్రయత్నం చేసి సిరిసిల్ల లో దివ్యమైన భవ్యమైన మార్కండేయ ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఇది మనందరి సంఘటితశక్తికి, స్వాభిమానా ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉంటుందని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా తను మన ధనాన్ని భగవంతునికి దేవాలయానికి సమర్పించి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని.మార్కండేయ స్వామి జయంతి మహోత్సవ సమితి తెలిపింద త్వరలోనే నిధి. సమర్పణ ప్రారంభం తేదీని
మీకు మీడియా ద్వారా తెలియపరుస్తాం దేవాలయానికి. ఇచ్చే ఒక ఇటుక కానీ, ఒక రూపాయి కానీ సమర్పణ చేస్తే తర తరాలకు పుణ్యం లభిస్తుంది . కావున ప్రతి ఒక్కరూ సమర్పణకి తను మన ధన ని సమర్పించి భాగస్వాములై భగవంతుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ మాదాస శ్రీనివాస్. నాగుల శ్రీనివాస్. కోడం రవి. గుంటుక పురుషోత్తం. చిమ్మని ప్రకాష్. గాజుల సదానందం. గుడ్ల విష్ణు. జిందం రవి. ఎనగంటి నరేష్. తదితరులు పాల్గొన్నారు.