31-07-2025 12:34:27 AM
నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో మరో జాక్‌పాట్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ఆమె నటన ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్‌లో నిధి చూపించిన డెడికేషన్ పవన్ కల్యాణ్ ను బాగా ఆకర్షించాయట. ఒకే రోజు 16 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చి, నాన్‌స్టాప్‌గా సినిమా ప్రమోషన్స్‌ను నడిపించిన నిధి, అందరి ప్రశంసలు అందుకుంది.
ఈ కమిట్మెంట్ చూసిన పవన్, ఆమెకు మరో అవకాశం ఇవ్వనునట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో నిధి అగర్వాల్ ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించ బోతున్నారట. సెప్టెంబర్ 25న ‘ఓజీ’ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఓసాంగ్ షూట్ చేయాల్సి ఉందని.. ఆ స్పెషల్ సాం గ్‌లో నిధి సందడి చేయబోతుందని టాక్ వినిపిస్తోం ది.
‘ఓజీ’ స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్‌కు బూస్టింగ్ ఇవ్వడం పక్కా అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌తో నిధి టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతుందని, ఈ అవకాశం ఆమెకు మరిన్ని ప్రాజెక్టులకు తెచ్చి పెడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో పవన్ ఉంటారా.? లేక నిధి అగర్వాల్ మాత్రమే కనిపిస్తుందా.. అనేది చూడాలి మరి.