09-08-2025 03:04:43 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 8: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. భారత్‌లో పర్యటించాలని ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో 23వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సద స్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కా వాలని పుతిన్‌ను మోదీ కోరారు. అనంతరం భారత్, రష్యా దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావడంపై చర్చించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యు ద్ధం తాజా పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్క రించుకోవాలని పుతిన్‌కు మోదీ సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా కూడా పంచుకున్నారు.
అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ.. భారత ప్రధాని రష్యా అధ్యక్షుడికి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాతో వాణిజ్యం, దౌత్య సంబ ం ధాల పటిష్టంపై మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను చర్చల కోసం రష్యా కు పంపించారు.