calender_icon.png 9 August, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత విద్యా విధానం ప్రవేశపెట్టిన స్టాలిన్

09-08-2025 03:08:46 AM

  1. హిందీ పాలసీకి తమిళనాడు సీఎం కౌంటర్
  2. రాష్ట్రంలో తమిళం, ఆంగ్లం మాత్రమే కొనసాగుతాయి

చెన్నై, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తా జాగా స్టాలిన్ హిందీ పాలసీకి కౌంటర్‌గా తమ రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా రాష్ట్ర వి ద్యా విధానాన్ని (ఎస్‌ఈపీ)ని ఆవిష్కరించా రు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్ర మంలో స్టాలిన్ ఎస్‌ఈపీ విధానాన్ని ఆవిష్కరించారు.

కేంద్రం చెబుతున్న త్రిభాషా సూ త్రాన్ని తోసిపుచ్చుతూ ద్విభాషా అజెండాతో దీన్ని రూపొందించారు. ఇకపై రాష్ట్రంలో సొంత భాష తమిళంతో పాటు ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ముసాయిదా పాలసీని రూపొందించేందు కు 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేషన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ గతేడాది తమ ప్రతిపాదనలను సీఎంకు అందిం చింది. దీన్ని పరిశీలించిన స్టాలిన్ సర్కారు తాజాగా నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. మాతృభాషతో పాటు ఆంగ్లం, కృ త్రిమ మేధ, సైన్స్ అధిక ప్రాధాన్యమిచ్చేలా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించారు.