calender_icon.png 21 October, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ

21-10-2025 02:28:38 PM

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం దేశ ప్రజలకు ఒక లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను, నక్సలిజంపై పోరాటాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచం సంక్షోభాలతో నిండిన సమయంలో భారత్ స్థిరత్వానికి చిహ్నంగా ఉద్భవించిందని చెప్పారు. వస్తువులు, సేవల పన్ను రేట్లను తగ్గించే నిర్ణయాన్ని తన ప్రభుత్వం సాధించి చారిత్రాత్మక విజయాలలో ఒకటిగా నిలిచిందన్నారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ సందర్భంగా ప్రజలు రూ.వేల కోట్లు ఆదా చేస్తున్నారని తెలిపారు.

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి, అన్ని భాషలను గౌరవించడానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, యోగాను స్వీకరించడానికి పౌరులు స్వదేశీని స్వీకరించాలని ఆయన కోరారు. ఈ ప్రయత్నాలన్నీ మనల్ని వేగంగా విక్షిత్ భారత్ వైపు తీసుకెళ్తాయని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవీ సిబ్బందితో దీపావళి జరుపుకున్న తర్వాత ఆయన ఈ లేఖను రాశారు.

దీపావళి పండుగ శుభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది శక్తి, ఉత్సాహంతో నిండిన పండుగ. అయోధ్యలో రామమందిరం గొప్పగా నిర్మించిన తర్వాత ఈ దీపావళి రెండవ దని ఆయన అన్నారు. శ్రీరాముడు మనకు ధర్మాన్ని నిలబెట్టడం నేర్పిస్తాడని, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇస్తాడని మోదీ చెప్పారు. కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం దీనికి సజీవ ఉదాహరణను చూశామని, భారత్ ధర్మాన్ని సమర్థించడమే కాకుండా అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి అన్నారు.

ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనదని, ఎందుకంటే మొదటిసారిగా దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో దీపాలు వెలిగిస్తారన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదాన్ని మూలం నుండి నిర్మూలించిన జిల్లాలు ఇవి. ఇటీవలి కాలంలో మన దేశ రాజ్యాంగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, హింసా మార్గాన్ని విడిచిపెట్టి అభివృద్ధి ప్రధాన స్రవంతిలో చేరిన చాలా మంది మావోయిస్టులను చూశామని, ఇది దేశానికి ఒక పెద్ద విజయం అని మోడీ హర్షం వ్యక్తి చేశారు.