21-10-2025 03:59:49 PM
గిరిజన మహిళ రాణి హత్య కేసుపై జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించాలి
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దినకర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దహేగాం మండలంలోని గేర్రె గ్రామంలో నిండు గర్భవతి అయిన గిరిజన యువతి తలండి శ్రావణి (రాణి)ని ఆమెకు మామయ్య అయిన శివార్ల సత్తయ్య గొడ్డలితో అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. హత్య ఘటనపై సోమవారం గ్రామాన్ని సందర్శించిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), ట్యాగ్స్ జిల్లా నాయకులు శ్రావణి కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ... ఇది కేవలం హత్య కాదు ఇది కుల దురహంకార హత్య అని , గర్భవతిని తెలిసి కూడా విచక్షణ లేకుండా హత్య చేసిన సత్తయ్యతో పాటు ఇతర పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, ప్రత్యేక కోర్టులో విచారించాలి,” అని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కులహత్యలు పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం చట్టసరైన రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని ఆయన విమర్శించారు. కులాంతర వివాహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలన్నారు.