21-10-2025 03:47:48 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): దేశంలోని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badavath Santosh) అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళి అర్పించారు. ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు అమూల్యమని కలెక్టర్ సంతోష్ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని, అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ గైక్వాడ్ తెలిపారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు చేపట్టిన ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్నారు.