21-10-2025 03:55:57 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి గ్రామంలో ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సబ్ సెంటర్లో అయోడిన్ ఉప్పు వాడండి ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేస్తూ విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అధిక మోతాదులో ఉప్పును వాడకూడదని సూచించారు. ప్రజలు అయోడిన్ ఉప్పు మాత్రమే వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, మాజీ సర్పంచ్ విశ్వేశ్వర్, ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నరు.