07-07-2025 01:12:03 AM
పాల్వంచలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జూలై 6 (విజయక్రాంతి): భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు తన జీవితాన్ని అర్పించిన మహానీయు డు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త పనిచేయాలని బిజెపి అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మొక్కలు నాటి పర్యావర ణ పరిరక్షణకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడాక్టర్ శ్యామా ప్రసాద్ ము ఖర్జీ భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప దేశభక్తుడనీ,కాంగ్రెస్ పాలనలో రెండు జెం డాలు, రెండు రాజ్యాంగాలు ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తులో దేశ సమగ్రత దెబ్బతినకూడదని , ఒకే జెండా ఒకే రాజ్యాంగం అవసరమని గళమెత్తిన ధీరుడన్నారు.
1951లో భారతీయ జనసం ఘ్ను స్థాపించి, హిందూ జాతీయవాదానికి బలమైన స్థాయిని కల్పించిన రాజనీతిజ్ఞుడన్నారు. దేశాభివృద్ధికి, సమగ్రతకు రాజకీయాలు వినియోగించాలి అనే దృక్పథం అప్పటి నుంచే ఆయనలో ఉంది. అదే దారిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్’ నినాదాలతో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు భూక్యా సీతారాం నాయక్, యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్,కొత్తగూడెం నియోజకవర్గ కో-కన్వీనర్ బుడగం రవి కుమార్,‘ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు దోమల రమేష్,కిసాన్ మోర్చా నాయకు లు భూక్యా వెంకట్,జిల్లా కౌన్సిల్ మెంబర్ దున్నపోతుల రాజు,కాల్వ ప్రసాద్, బత్తుల వెంకటేశ్వరావు, గుండు రాజు, బానోత్ వెంక ట్, నాగూర్ మీరా, శేఖర్, గిరి గౌడ్, గంధమల్ల రాము, ప్రతా ప్, వెంకన్న, సీతారాములు, వెంకటేష్, డి. శ్రీను, క్రాంతి తదితరులు.