04-08-2025 10:51:24 PM
కోనరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామ శివారులో సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి, తన సిబ్బందితో వాహన తనిఖీ చేయుచుండగా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన బండి అశోక్ తండ్రి రాజయ్య, కెంగర్ల చందు తండ్రి ఎల్లయ్య అను వారు ప్యాషన్ ప్రొ బండిపై అనుమానాస్పదంగా రాగా, ఎస్‌ఐ వారిని పట్టుకొని విచారించగ, వారు ఇల్లంతకుంట, చందుర్తి, కోనరావుపేట పోలీసు స్టేషన్ ల పరిధిలో దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు.
వారి వద్ధ నుంధి ఒక ద్విచక్రవాహనం, AP10 AS 2910 మరియు 2 గొర్రెలు, 2 గొర్రె పిల్లలు, 1 పొట్టేలును, వాటి విలువ రూ. 48,000/- స్వాధీన పరుచుకున్నారు. మిగిలిన గొర్రెలను పత్రి నర్సింహులు బెజ్జంకి అనునతనికి అమ్మి, రూ. 50,000/- లను వారి జల్సాలకు వాడుకున్నారని తెలిపినరు. ఇట్టి దొంగతనం కేసులో ప్రతిభ కనబరిచిన కోనరావుపేట ఎస్‌ఐ. ప్రశాంత్ రెడ్డి కానిస్టేబుల్ లు, రవి, విశాల్, జగన్ లను సీఐ వెంకటేశ్వర్లు అభినంధించారు.