calender_icon.png 5 August, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొన్నారం హాస్టల్ ను అందుబాటులోకి తీసుకురావాలి

04-08-2025 10:47:56 PM

టీవీజెఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ) బాలుర వసతి గృహాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి నిరుపేద విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బచ్చలి ప్రవీణ్ కుమార్(President Bachali Praveen Kumar) కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొన్నారం గ్రామంలో ప్రభుత్వ వసతి గృహం ఉన్నప్పటికీ రెగ్యులర్ వార్డెన్, సిబ్బంది కొరతతో వసతి గృహాన్ని ప్రారంభించలేదని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

పొన్నారం గ్రామంలో ప్రభుత్వ వసతి గృహం ఉన్నప్పటికీ రెగ్యులర్ వార్డెన్, సిబ్బంది కొరతతో వసతి గృహాన్ని ప్రారంభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు, మండలం లోని వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు దూర భారంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరితగతిన బాలుర హాస్టల్ కు రెగ్యులర్ వార్డెన్, సిబ్బందిని నియమించి, పేద విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.