calender_icon.png 13 August, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లబండగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి సంప్రోక్షణ శాంతి హోమం

12-08-2025 05:35:09 PM

కోదాడ: మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి సంప్రోక్షణ శాంతి హోమం గ్రామస్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లబండగూడెం గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయం వద్ద గ్రామ పురోహితులు రామయ్య బృందం ఆధ్వర్యంలో శాంతి హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని శాంతిహోమాన్ని తిలకించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఎలాంటి విఘ్నాలు జరగకుండా చూడాలని శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పున్నం కోటేశ్వరరావు,నలపాటి నరసింహారావు, శరబేశ్వరరావు, ముండ్రా రంగారావు, ఏదులాపురం శ్రీనివాసరావు, ఆదినారాయణ, రమాసుందర్రావు, గోపి, నలపాటి శ్రీనివాసరావు, రంగా బాబు, బెంజిమెన్, నర్రా వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, శివరామకృష్ణ, ముత్తయ్య, కలకొండ నాగేశ్వరరావు, కంచుగంటి బాబు, నేలవెల్లి నారాయణ, సిహెచ్ సుధాకర్, ముండ్ర సీతయ్య, ఈదర వెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.