calender_icon.png 12 August, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి సర్వే పూర్తి వివరాలు ఇవ్వండి

12-08-2025 05:18:31 PM

ఖానాపూర్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ కమిటీ..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీలోని 110 ఎకరాల స్థలంలో అధికారులు చేపట్టిన సర్వే పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ కమిటీ సభ్యులు మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఖానాపూర్ పట్టణానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఖానాపూర్ 110 ఎకరాల స్థలంలో నిర్మించాలని దాని సాధన కోసం జేఏసీగా ఏర్పడిన నాయకులు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ నిర్మాణానికి రెవెన్యూ స్థలం లేదని ఇచ్చిన వివరాల ప్రకారం, పూర్తి స్థలం సర్వే కోసం పై అధికారుల ఆదేశాల మేరకు ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసిన వివరాలను తమకు ఇవ్వాలని వారు కోరారు.

ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ నంది రామయ్య మాట్లాడుతూ... పాఠశాలను విద్యార్థుల భవిష్యత్తు దృశ్య ఇక్కడే నిర్మాణం చేయాలని, ప్రజల అభీష్టం పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవాధ్యక్షులు సాగి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి కాశవీని ప్రణయ్ కుమార్, ముఖ్య సలహాదారులు అంకం మహేందర్, సందుపట్ల శ్రావణ్, భూక్య రమేష్, గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.