12-08-2025 05:09:13 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలోని 108 అత్యవసర సర్వీసుల సేవలను మంగళవారం రోజున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత(Health Department Officer Rajitha) పరిశీలించారు. 108 వాహన సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వాహనంలోని ఆక్సిజన్ నిల్వలు మానిటర్, ఏఈడి బీపీ ఆపరేటర్, సెక్షన్ ఆపరేటర్, లారింజో స్కోప్, అమ్బు బ్యాగ్స్, సర్వైకల్ కాలర్, స్ప్లింట్, ఫోర్ టేబుల్ ఆక్సిజన్ సిలిండర్, స్పైన్ బోర్డ్స్ తదితర అత్యవసర వైద్య పరికరాల పనితీరును, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ సేవలందించాలని, రానున్న నాలుగైదు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, 108 వాహన సిబ్బంది పెద్ది శ్రీనివాస్, బరిగె లక్ష్మణ్ వడ్నాల అనిల్ కుమార్, అలుగొండ ప్రవీణ్, కుమ్మరవేని సాయికృష్ణ, గుగులోతు శ్రీకాంత్ నలికే నవీన్, పంతంగి మహెశ్, పంతం సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు..