12-08-2025 05:01:56 PM
మునగాల (విజయక్రాంతి): మండలంలో ఎలాంటి అసాంఘికకార్యకలాపాలకు తావు ఉండదని ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) స్పష్టం చేశారు. మండల పరిధిలో అక్రమ వ్యాపారాలు, గుడుంబా తయారీ, ఇసుక అక్రమ రవాణా, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. చట్టం ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని ఎస్ఐ హెచ్చరించారు.