25-09-2025 12:08:06 AM
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మిర్యాలగూడ, సెప్టెంబర్ 24 : గిరిజన యువకుడు సాయి సిద్దు పై వాడపల్లి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతి క్రూరంగా కొట్టడం అమానుషమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం దామచర్లన మండల పరిధిలోని కొత్తపేట తండాలో సాయి సిద్దు ని పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక అరాచక రాజ్యం నడుస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచక పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తప్ప ఒకరికి తొత్తుగా పని చేయకూడదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెబితే న్యాయ అన్యాయాలు చూడకుండా అమాయకులను కొట్టడం ఎంతవరకు సబ బు అని అన్నారు.
రాష్ట్రంలో యూరి యా కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రశ్నించిన వారిపై పోలీసులతో దాడి చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సాయి సిద్ధూ యూరియా కోసమే వెళ్లి అక్కడ చిన్నపాటి ఘర్షణ జరగడంతో కాంగ్రెస్ నాయకులు సాయి సిద్దు పై వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆపై సాయి సిద్దు పై పోలీసులతో విచక్షణ రైతంగా కొట్టడమే కాకుండా సిద్దు భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
ఈ జిల్లాలోని యూరియా కోసం పడి కాపులు కాస్తూ ఉన్న మహిళలు తోపులాట చేసుకోవడంతో ఓ మహిళ ప్రాణాలు విడిచిందని ఈ ఘటనతో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయని నేపథ్యంతో ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తరలింపుతుందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే యూరియా దందా చేస్తూ లారీలకు లారీలు పక్కదారి మల్లిస్తూ సొమ్ము చేసుకుంటూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
సాయి సిద్దు పై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం సాయి సిద్దు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు