అశ్వాపురం భారజల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్
అశ్వాపురం మే 11 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని అశ్వాపురంలో గలబారాజల కర్మాగారంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఏదైనా అత్యవసర సమయంలో, ఆకస్మిక దాడి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సందర్భానుసారంగా రక్షణ కొరకు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి తెలియపరుస్తూ ఈ మాక్ డ్రిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.
భారజల కేంద్రంలో ఉద్యోగులు పనిచేసే చోట, కాలనీలో నివసించే వారి కుటుంబాలు అత్యవసర సమయంలో అలారం సిస్టంను వినియోగించినప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్‌ఎఫ్ కమాండెంట్ అమిత్ కుమార్, అశ్వాపురం సిఐ జి అశోక్, ఎస్‌ఐ మధు ప్రసాద్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అశ్వాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






