12-05-2025 12:25:31 AM
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 11 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం ప్రకటించిన ఎఫ్సెట్ ఫలితాల్లో ఖమ్మం హార్వెస్ట్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. 2024 -విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ చదువులకు నిర్వహించిన పరీక్షల్లో హార్వెస్టర్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ విద్యకు 200 మంది పరీక్షకు హాజరు కాగా బీ. సాయి చరణ్ 77వ ర్యాంకు సాధించి కళాశాలలో అగ్రభాగంలో నిలిచారు. బి సిద్ధార్థ 193 ఎన్ రాఘవేంద్ర నవనీత్ 265 ర్యాంక్, డి శ్రీనివాస్ గౌతమ్ రెడ్డి 336 ర్యాంక్, ఎం నాగయశ్వంత్ 448 ర్యాంక్, ఆర్ వెంకటసాయి వర్షిత్ 724ర్యాంక్, ఎన్ సి హెచ్ యశ్వంత్ సాయి, 958 ర్యాంక్ సాధించారు.
ఎంపీసీ విభాగంలో 5 వేలు లోపు 20 మంది, 10వేల లోపు 26 మంది, 20 వేల లోపు 50 మంది ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరీల్లో 30 వేల లోపు ర్యాంకు సాధించిన 69 మంది టాప్ కళాశాలలో సీటు సాధించే అవకాశం ఉందన్నారు. బైపిసి విభాగంలో జి రాణి ఉమా అలేఖ్య 120 వ ర్యాంకు సాధించి కళాశాల అగ్రస్థానంలో నిలిచారు. టి డి వి ఎస్ ఎస్ నయామంజలి 161వ ర్యాంక్, బి భార్గవి 202వ ర్యాంక్, ఎండి అనిష ముస్కాన్ 232వ ర్యాంక్, సరోజ్ రాజు పురోహిత్ 384 ర్యాంకులో నిలిచారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులను హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి .రవి మారుత్, ప్రిన్సిపాల్ ఆర్ పార్వతి రెడ్డి అభినందించారు.