04-08-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం,ఆగస్టు 3(విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, నివారణ చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నగర వ్యాప్తంగా మెరుపు నాఖాబందీ నిర్వహించారు. నగరంలోని 20 ప్రధాన కూడళ్ల వద్ద సుమారు 150 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పా టు,
నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూ ట్ డ్రైవ్ మరియు సరైన ధ్రువపత్రాలు (డాక్యుమెంట్లు) లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.
ఈ కార్యక్రమం గురించి పోలీస్ కమిషనర్ గౌస్ అలం మాట్లాడుతూ, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు తప్పనిసరి గా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసుల కు సహకరించాలనికోరారు. ఈ చర్యల ద్వా రా నగరంలో నేరాలను నియంత్రించి, ప్రజలకు మరింత భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఆయనపేర్కొన్నారు.