04-08-2025 12:00:00 AM
-నిరక్షరాస్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-వయోజన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి
మంచిర్యాల, ఆగస్టు 3 (విజయక్రాంతి): నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కొరకు ‘ఉల్లాస్’ కార్యక్ర మాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని వయోజన విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ జి ఉషారాణి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని వయోజన విద్యా కార్యాలయాన్ని సందర్శిం చి జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ఉల్లాస్ కార్యక్రమం పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డైరె క్టర్ మాట్లాడుతూ నిరక్షరాస్యతను పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వయోజనులైన ప్రతి ఒకరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆండాలమ్మ కాలనీలో వయోజన విద్య కార్యక్రమాల ద్వారా వృత్తి శిక్షణ, అక్షరాస్యత పొందిన మహిళలతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. వయోజన విద్య ద్వారా అక్షరాస్యులై ఓపెన్ టెన్త్, ఇంటర్ ద్వారా ఉన్నత చదువులను చదువుకోవడం ఎంతో మందికి ఆదర్శమని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ చౌదరి, సత్యనారాయణమూర్తి, డి.ఆర్.పి. సుమన్ తదితరులు పాల్గొన్నారు.