calender_icon.png 8 November, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్లపై పోలీసుల కొరడా

08-11-2025 01:11:27 AM

-8 రాష్ట్రాల్లో 55 మంది అరెస్ట్

-నిందితుల ఖాతాల్లో రూ.107 కోట్ల భారీ లావాదేవీలు గుర్తింపు

 హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి) : నగరవాసులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ర్ట సైబర్ నేరగాళ్ల ముఠాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత నెల అక్టో బర్-లో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, 33 కీలక కేసులకు సంబంధించి 55 మంది నిందితులను అరె స్టు చేశారు. ఈ ఆపరేషన్ల ద్వారా బాధితులు కోల్పోయిన రూ. 62,34,446లను తిరిగి రాబట్టి వారికి అప్పగించారు.

ఈ వివ రాలను హైదరాబాద్ అదనపు పోలీస్ కమి షనర్ క్రైమ్స్ సిట్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్టోబర్‌లో ఒక్క హైద రాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధి లోనే 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, జోనల్ సైబర్ సెల్స్‌లో మరో 130 కేసులు నమోదయ్యాయి. అరెస్టయిన 55 మంది నిందితులకు 61 బ్యాంకు ఖాతాలు ఉన్నా యని, వాటి ద్వారా సుమారు రూ.107 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ నిందితులకు దేశవ్యాప్తంగా 136 కేసులతో సంబంధం ఉండగా, అందులో 45 కేసులు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ర్ట, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఈ అరెస్టులు జరిగాయి. నింది తుల నుంచి 31 మొబైల్ ఫోన్లు, 14 చెక్ బుక్కులు, 9 డెబిట్ కార్డులు, 2 ల్యాప్‌టా ప్‌లు స్వాధీనం చేసుకున్నారు.