2 August, 2026 | 12:52 AM

సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు

22-06-2024 05:41 PM

హైదరాబాద్: సెల్ ఫోన్ దొంగలపై పోలీసులు శనివారం కాల్పులు జరిపారు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ సమీపంలో జరిగింది. సికింద్రాబాద్ లో అర్ధరాత్రి  సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్ చల్ చేసింది. వాళ్లను పట్లుకునేందుకు పోలీసులు వెంటపడ్డారు. పోలీసులను చూసిన దొంగలు పారిపోతుంటే వారిపై కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో ఒక దొంగకు గాయాలు కాగా.. మరి కొందరు తప్పించుకున్నారు. దీంతో సీపీ సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.