25-10-2025 07:28:36 PM
మోర్తాడ్,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ” కార్యక్రమం ఎస్సై రాము పోలీస్ స్టేషన్ నుండి మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ ఎస్ఐ రాము మాట్లాడుతూ... ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు ,తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని తెలియజేశారు. ఈ దేశం కోసం న్యాయం కోసం ,ఎప్పటికీ తలవంచకుండా. పక్షపాతం లేకుండా, సేవా చేద్దామని పేర్కొన్నారు.