31-10-2025 01:54:57 PM
 
							పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో(Sultanabad Shiva Temple) చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు , అనంతరం ఉసిరి మొక్కలను అందజేశారు. అలాగే శ్రీ గణేష్ రాజరాజేశ్వరి భక్త బృందం మహిళలు శివాలయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం గోవు పూజ, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వోడి బియ్యం సమర్పణ, ధాత్రి నారాయణ పూజ, తులసి, మారేడు మొక్కల పంపిణీ, కార్తీక జ్యోతులు వెలిగించడం జరిగింది. మహిళలు పరస్పరం పసుపు కుంకుమలు అందించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ- భాగ్యలక్ష్మి , అర్చకులు వల్లకొండ మహేష్, రజిత, వల్లకొండకొండ రమేష్, శైలజ, అల్లంకి అరుణ్, మనీషా, డైరెక్టర్లు శివలీల, వనిత, సుమతి, రమాదేవి, మంజుల, భక్తబృందం పారుపల్లి గుణపతి, సామల హరికృష్ణ , లెక్కల శంకరయ్య , కొమురవెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.