calender_icon.png 2 August, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ ఎడ్యుకేషన్..

02-08-2025 03:49:43 PM

నీట్ మెడిసిన్, ఐఐటీ జేఈఈ, ఐఐటి ఫౌండేషన్..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల కళాశాల నందు అనకాడమీ ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ముందు చూపుతో విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో అనేక వినూత్న కార్యక్రమాలతో నూతన ఓరవడితో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ(District Collector Sandeep Kumar Jha) ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో జిల్లాలోని అన్ని పాఠశాలలకు విస్తరించడం మంచి శుభ పరిణామం అని పేర్కొన్నారు.

దీనిలో భాగంగా ఐఐటి ఫౌండేషన్, నీట్ మెడిసిన్, ఐఐటి జేఈఈ సంబంధించిన ఆన్లైన్ శిక్షణ తరగతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాటిని ప్రారంభించి వాటి యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని అటువంటి ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్కిల్ యూనివర్సిటీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. దీనిలో భాగంగా ప్రతిరోజు ఈ పాఠ్యాంశాలని విద్యార్థిని విద్యార్థులకు చేరేలాగా ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించడం జరిగింది.  దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీలు ఐఏఎంలు ఎయిమ్స్ లాంటి సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది ఆ సంస్థలలో ఎంపికైన విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ శిక్షణను కొనసాగిస్తారని చెప్పారు. తద్వారా బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు కూడా అత్యంత నాణ్యమైన విద్య అందించే అవకాశం లభిస్తుందని తెలియజేశారు.

మనం అందించే బోధనతో పాటు అదనంగా ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ఆన్లైన్ ద్వారా విద్యను కూడా అందించినట్లయితే భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యావేత్తలు శిక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క విలువైన సూచనలను బోధనను అందిస్తారని తెలిపారు. విద్యార్థులు సైతం క్రమశిక్షణతో ఇప్పటినుండే ముందు చూపుతో వ్యవహరించాలని మంచి ఫలితాలు అందుకోవడానికి కృషి చేయాలని సూచించారు. అలాగే ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు సూచించారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, మార్కెట్ కమిటీ చైర్మన్ రోడ్డి రాజు, ప్రిన్సిపాల్ శ్యామల ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.