02-08-2025 03:33:36 PM
పీఎం కిసాన్ సమ్మాన్ రైతుల పాలిట వరం..
ధర్మపూర్ రైతు వేదికలో పీఎం నరేంద్ర మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి వీక్షించిన ఎంపీ డీకే. అరుణ..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రైతు సంక్షేమ కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) అన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత రిలీజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని రైతులతో కలిసి ఎంపీ డీకే అరుణ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశంలోని రూ 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ 21 వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిదులు జమ చేయడం జరిగిందని తెలిపారు. చేసేదే చెప్తుంది.. చెప్పింది చేసి చూపిస్తుంది మోదీ సర్కార్ అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలోని 65,996 మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు.
కిసాన్ సమ్మాన్ కింద 20వ విడత నిధులు విడుదల చేయడం సంతోషకరమన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఏడాదికి మూడు విడతలు కలిపి రూ. 6000 జమ చేస్తున్నదన్నారు. రైతులకు తక్కువ సబ్సిడీ తో ఎరువులు అందచేస్తుందన్నారు. ఏడాదిలో ఎకరాకు 18000 సబ్సిడీతో ఎరువులు అందిస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ కోసం అయ్యే ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందన్నారు. సుత్తిలి దారం మొదలు, గొనె సంచుల వరకు అన్ని ఇస్తున్నది కేంద్రమే అన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేష్, బిజెపి నాయకురాలు పద్మజా రెడ్డి, ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.