02-08-2025 03:30:31 PM
ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన సమితి నాయకుల అరెస్టు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ స్థానిక ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన సమితి పిలుపునిచ్చిన ఖానాపూర్ బంద్ శనివారం విజయవంతం అయింది. స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు, స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, బందు విజయవంతం అవడంతో ప్రజల మనోభావాలను ఖానాపూర్ ఎమ్మెల్యే గ్రహించి పాఠశాల నిర్మాణం ఖానాపూర్ లోనే చేపట్టాలని, లేదంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రయత్నించగా పోలీసులు సీఐ అజయ్ బాబు ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన సమితి నాయకులు నంది రామయ్య, సాగి లక్ష్మణరావు, కొండాడి గంగారావు, ఆకుల శ్రీనివాస్ ,కాశ వేణి ప్రణయ్, గజేందర్, నారాయణ, తదితరులు ఉన్నారు.