14-10-2025 07:20:04 PM
కుభీర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ సభ్యత్వ నమోదు కార్యక్రమం(Membership Drive) విస్తృతంగా ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షుడు శ్రీ దాసరి శంకర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఐక్యంగా టీఎస్ యుటిఎఫ్ లో సభ్యులుగా చేరి తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీ(Pay Revision Commission) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పాత పీఆర్సీ గడువు ముగిసినా ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరిగిన ఈ పరిస్థితుల్లో వేతన సవరణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. దాసరి శంకర్ మాట్లాడుతూ, “టీఎస్ యుటిఎఫ్ ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు సంఘంలో చేరి తమ బలాన్ని తెలియజేయాలి,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో టొడియాహెట్టి భూమన్న, శైఖ్ ఫాజిల్, చందుల వీరేష్, గడ్డం నరేష్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.