calender_icon.png 11 July, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న పోలీస్ వారి హెచ్చరిక

09-07-2025 12:00:00 AM

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన ‘పోలీస్ వారి హెచ్చరిక’. సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి  తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ.. “సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాం. జూలై 18న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ..

“నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నా. తల్లిదండ్రులు, భారతదేశా న్ని, ఇప్పుడు కళామతల్లిని. మిలటరీ నుంచి వచ్చిన నన్ను కళామతల్లి నిలబెడుతుందని నమ్ముతున్నా” అన్నారు. టాలీవుడ్ దర్శకుడు సము ద్ర, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్, నటీనటులు శుభలేఖ సుధాకర్, ఇంద్రజ, చిత్రబృందం పాల్గొన్నారు.