03-01-2026 12:00:00 AM
సైబర్ మోసాలకు చెక్..
అత్యాశకు పోయి.. సైబర్ నేరగాళ్లకు చిక్కి..
ఆన్‌లైన్ గేమ్స్, యాప్‌లలో పెట్టుబడులు
పోలీసుల హెచ్చరికలు
సిద్దిపేట, జనవరి 2 (విజయక్రాంతి): ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో సైబర్ నేరగాళ్లకు చిక్కి పరువు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్, యాప్ లలో పెట్టుబడులు పెట్టడం మోసపోవడం వల్ల వారి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుంది. అనేక మంది యువకులు, ఉద్యో గులు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.
కాల్‌కు ఫుల్ స్టాప్..
సైబర్ మోసాలకు ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉ ద్యోగులు, వృద్ధులు, యువతి, యువకులు, సాధారణ ప్రజలు మోసపోతున్నారు. వీటన్నింటికీ ఫ్రాడ్ కా పుల్ స్టాప్ యాప్‌ని ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేసేందుకు సిద్దిపేట పోలీసులు కృషి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నత విద్య కళా శాలలో (డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్, ఫార్మ సీ, మెడికల్ కళాశాలలు) లెక్చరర్ ఐదుగురు విద్యార్థులు ఒక పోలీస్ అధికారి తో కలిపి సైబర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ కళాశాలలో కమి టీలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గోల్డెన్ ఫిర్యాదు..
సైబర్ క్రైమ్ కు గురైన బాధితులు గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తేనే ఎంతో కొంత నష్టా న్ని నిల్పవచ్చని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్ కి గురైన సుమారు గంటలోపు 1930 టోల్ ఫ్రీ నంబర్ కి సమాచారం ఇస్తేనే పోలీసులు సాధ్యమైనంత త్వరగా బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందనీ పోలీసులు చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్, బ్లాక్ మెయిలింగ్, సైబర్ మోసం, పైసా పైలం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, యాప్స్ ద్వారా రుణాలు పొందడం, గిఫ్ట్ ఫ్రాడ్ కాల్, రివార్డులు వంటి ప్రకటనలు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, ఏపీకె ఫైళ్లు వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మేరా లాజిక్ మేరా రూల్, సెల్ ఫోన్ హ్యాకింగ్, సోషల్ మీడియా, ఓటిపి, కేవైసీ, కస్టమర్ కేర్, మహిళాల రక్షణ డేటింగ్ యాప్స్, సైబర్ స్టాకింగ్, పెళ్లి సంబంధాలు వంటి అంశాలతో పాటు పిల్లలతో సభ్యంగా మాట్లాడించే యాప్స్, అసభ్యకర పదజాలంతో కొనసాగుతున్నాయి. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు.
మోసాలపై విస్తృతంగా
ప్రచారం చేస్తున్నాం..
సైబర్ క్రైమ్‌కు నేరగాళ్లు సెల్‌ఫోన్ కేంద్రంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే వారందరూ ఓటిపి, పాస్వర్డ్ ఎవరికి చెప్పవద్దు. బ్యాంకుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్‌ని నమ్మొద్దు. అవసరమైతే బ్యాంకుకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకున్నాకనే బ్యాంకుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలి కానీ ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడితే నమ్మవద్దు. సైబర్ క్రైమ్‌కి ప్రధానమైన కారణం ఆన్లైన్ గేమింగ్, వివిధ యాప్ల ద్వారా రుణాలు పొందడం, సులభంగా డబ్బు సంపాదించడం వంటికి ఆశపడి మోసపోతున్నారు. గంటలోపు 1930 కి సమాచారం ఇస్తే గోల్డెన్ అవర్లో ఫిర్యాదుగా భావించి బాధితులకు సాధ్యమైనంత మేరకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ ద్వారా సిద్ధిపేట ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
జి.శ్రీనివాస్, ఏసీపీ
సైబర్ క్రైమ్, సిద్దిపేట