calender_icon.png 3 January, 2026 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ముందస్తు సంక్రాంతి సంబురాలు

03-01-2026 12:00:00 AM

ముకరంపుర, జనవరి 2 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లి  అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి  హాజరై శ్రీ మహా విష్ణుమూర్తికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉన్న దని,  శ్రీమహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన పండుగ అని, ఈ పండుగ ద్వారా పల్లె వాతావరణం ఉట్టిపడేలా కనబడుతుందని చెప్పారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,  విద్యార్థులు పాల్గొన్నారు.