calender_icon.png 24 January, 2026 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ బూత్ లు మార్పు చేయాలి

24-01-2026 08:28:14 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఓటర్ లిస్టు జాబితా ప్రకారం దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో కాకుండా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్కు తరలించారని, పోలింగ్ బూత్లను మార్పు చేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని దుర్శేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయికి వినతి పత్రం అందజేశారు.

దుర్శేడ్ గోపాల్పూర్ గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేసి 4, 5 డివిజన్లుగా విభజించారని, అయితే ఎన్నికల సంఘం మొదటిసారి విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా జారీ చేయగా, తమరి దృష్టికి తీసుకురావడంతో సవరణ చేసి తుది జాబితాను విడుదల చేసినారని తెలిపారు. కానీ తుది జాబితా ఓటర్ లిస్టు ప్రకారం తో ఇరు గ్రామాల ప్రజలు ఓటు వేసేందుకు మొత్తం 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఓటర్లకు దగ్గరలో ఉన్న పోలింగ్ బూతుల్లో ఓటు వేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.