24-01-2026 08:32:32 PM
అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం లోని మహాత్మ జ్యోతి బా పూలే వెనుకబడిన తరగతుల బాలుర డిగ్రీ , జూనియర్ కళాశాలలో శనివారం ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫేర్వెల్, కాలేజీ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి సీహెచ్ రాంబాబు, డీసీఓ బ్యూలా రాణి, అన్నపరెడ్డిపల్లి ఉప సర్పంచ్ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీఓ రాంబాబు మాట్లాడుతూ... విద్యార్థుల ఉన్నత చదువుతో పాటు పోటీ పరీక్ష రంగంలో ముందు ఉండాలన్నారు.
క్రీడారంగ ప్రాధాన్యత గురించి తెలిపి స్టేట్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్ లో పాల్గొన్న విద్యార్థులను వారికి శిక్షణ ఇచ్చిన పీడీ డాక్టర్ రఘువరన్ ను అభినందించారు. కళాశాల స్పెషల్ ఆఫీసర్ ఎస్ కె బురాన్ మాట్లాడుతూ కళాశాల వార్షిక నివేదిక లో భాగంగా విద్యార్థుల అభివృద్ధి కి కారణమైన అధ్యాపకుల గురించి ,విద్యార్థుల ఉత్తీర్ణత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలోని అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ టీ పి శ్రీకాంత్, డిప్యూటీ వార్డెన్ మధు, పి డి. డాక్టర్ రఘు వరుణ్ అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, తల్లి తండ్రులు, పాల్గొన్నారు.