calender_icon.png 29 October, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‎లో పలుచోట్ల కురుస్తున్న చిరుజల్లులు

29-10-2025 10:52:53 AM

హైదరాబాద్: మొంథా తుపాన్ ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం, చిరుజల్లులు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్. ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మధురానగర్, కృష్ణానగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డిగూడ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్, కూకట్ పల్లి, హైదర్ నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్ బీ, ఆల్వీన్ కాలనీ, గచ్చిబౌలి, ఖాజాగూడ, నానక్ రాంగూడ, మెహదీపట్నం, టోలిచౌకి, మణికొండ, రాయదుర్గం, పంజాగుట్ట, పటాన్ చెరు, మియాపూర్, అంబర్ పేట్, కాచిగూడ, నల్లకుంట, బర్కత్ పురా, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్  నగర్, పెద్ద అంబర్ పేట, బీఎన్ రెడ్డినగర్, మీర్ పేట్, బాలానగర్, బడంగ్ పేట్, మన్సూరాబాద్, నాగోల్, అబ్దుల్లాపూర్ మెట్, మలక్ పేట్, సైదాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, సంతోష్ నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, మహేశ్వరం, తుక్కుగూడ, పహాడీషరీఫ్, సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, గాంధీనగర్, జవహర్ నగర్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, దోమల్ గూడ, కవాడిగూడ, భోలక్ పూర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి వర్షం కురవడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. రాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ బాయ్స్ కి వర్షం ఇబ్బందిగా మారింది. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అటు తెలంగాణలో పలు జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది.