calender_icon.png 11 December, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే పోలింగ్

11-12-2025 02:00:46 AM

గ్రామాలకు చేరిన పోలింగ్ సామగ్రి

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటల నుండి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత స ర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించి ఎన్నికల అధికారులు విజేతలకు గెలుపు ధృవపత్రాలను అందిస్తారు. 

తొలి దశలో 511 సర్పంచ్,3,793 వార్డు సభ్యుల ఎన్నిక

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత 511 గ్రామ సర్పంచ్, 3,793 వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ జిల్లాలో 65 సర్పంచ్, 505 వార్డు స భ్యుల ఎన్నిక నిర్వహిస్తుండగా, వరంగల్ జి ల్లాలో 88 సర్పంచ్, 585 వార్డు సభ్యులు, జనగామ జిల్లాలో 100 సర్పంచ్, 785 వార్డు సభ్యులు,

భూపాలపల్లి జిల్లాలో 73 సర్పంచ్ 559 వార్డు సభ్యులు, ములుగు జి ల్లాలో 39 సర్పంచ్, 287 వార్డు సభ్యులు, హ నుమకొండ జిల్లాలో 64 సర్పంచ్, 600 కు పైగా వార్డు సభ్యులు, మహబూబాబాద్ జిల్లాలో 146 సర్పంచ్, 1,072 వార్డు సభ్యు ల ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

తొలి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవే..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల వివరాలు ఇలా ఉన్నాయి. మహబూ బాబాద్ జిల్లాలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాలు ఉండగా, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, ములుగు జిల్లాలో తాడువాయి,

ఎటునాగారం, గోవిందరావుపేట, భూపాలపల్లి జిల్లాలో గణపు రం, రేగొండ, మొగుళ్లపల్లి, కొత్తపల్లి గోరి, జనగామ జిల్లాలో చిలుపూరు, స్టేషన్ ఘనాపూర్, రఘునాధపల్లి, జఫర్గడ్, లిం గాల గణపురం, హనుమకొండ జిల్లాలో భీమదేవరపల్లి, ఎలుకతుర్తి, కమలాపూర్ మండలాలున్నాయి.

ఓటుకు @500...?

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు తక్కువలో తక్కువ 500 రూపా యలు, పోటీ తీవ్రంగా ఉన్నచోట 1000 నుంచి 2000 రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం ఉవ్వెత్తున సాగుతోంది. చిన్న పంచాయతీల్లో సైతం ఓటుకు నోటు పంచేందుకు అభ్యర్థు లు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదాయ వనరులు అధికంగా ఉన్నచోట,

సర్పంచ్ పదవీ ప్రాబల్యానికి డిమాండ్ ఉన్నచోట 1000 నుంచి 2000 రూపాయలు పంచడానికి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ముందు వెనక ఆడడం లేదని ప్రచారం సాగుతోంది. సర్పం చ్ అభ్యర్థి డబ్బులతో పాటు వార్డు సభ్యులు కూడా కొంత కలిపి ఓటర్లకు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికలతో పోలిస్తే గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఈసారి బాగా కాస్ట్లీగా మారిపోయినట్లు ప్రచారం సా గుతోంది.

ఇప్పటికే ప్రచార పర్వంలో మద్దతిచ్చిన వారికి రోజుకు కొంత చొప్పున నగదు ఇవ్వడంతో పాటు సాయంత్రం పూ ట మందు, విందు తో సంతృప్తి పరిచినట్లు ప్రచారం సాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి యువత కూడా పెద్ద ఎత్తున ఎన్నికల బరిలో నిలిచారు. యువ ఓటర్లు, మహి ళా ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

దూరప్రాంతాల వారికి ‘ప్రత్యేక’ ఏర్పాట్లు

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామీణ ఓటర్లను పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు రప్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి వచ్చి వెళ్లడానికి రవాణా చార్జీలతో పాటు తమకు కచ్చితంగా ఓటు వేస్తే కొంత నజరానాగా ముట్ట చెప్పడానికి నిర్ణయించుకున్నట్లు ప్ర చారం సాగుతోంది.

తమకు కచ్చితంగా ఓ టు వేసే అవకాశం ఉన్న వారు సుదూర ప్రాంతాల్లో ఉన్నా రప్పించడానికి ప్రత్యేకం గా వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువమంది ఉంటే మినీ బస్సులు, నలుగురికి లోపు ఉంటే కారు, ఐదు ఆరు గురు ఉంటే పెద్ద కార్లు పంపిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావడంతో ఓటర్ల జాబితా ముందేసుకుని గెలుపుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు హరిత పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 

 మహబూబాబాద్ (విజయక్రాంతి)