calender_icon.png 11 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది మా అస్తిత్వ సమస్య మా ఆత్మగౌరవ సమస్య

11-12-2025 01:37:32 AM

రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు

* ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే. ఆయన విగ్రహాన్ని ఏ రామోజీ ఫిల్మిం సిటీలోనో, ఏ ఫిల్మ్ నగర్‌లోనో పెట్టుకోవచ్చు. అలా చేస్తే మేం ఎవరం వ్యతిరేకించం. కానీ, రవీంద్ర భారతిలో విగ్రహం పెడతామంటే ఎలా? తెలంగాణ కోసం జీవితాలు అర్పించిన కళాకారులు,  కవుల విగ్రహాలు అక్కడ ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇది మా ఆస్తిత్వ సమస్య. మా ఆత్మగౌరవ సమస్య.

 రసమయి బాలకిషన్, తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయ క్రాంతి) : తెలంగాణ అంటే కేవలం ప్రాం తం మాత్రమే కాదు. నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వం.. ఆత్మగౌరవం. ఆరు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా అస్తిత్వాన్ని సాధించుకున్నా ఆత్మ గౌరవం పొందడం లో మాత్రం వెనుకబడుతున్నాం. నాడు అస్తిత్వం దాడి జరిగితే.. నేడు ఆత్మ గౌరవంపై దాడి జరుగుతున్నది. 2014కు మునుపు తెలంగాణ అంటేనే వెక్కిరింత. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టు, బొట్టు, పండుగలు అంటేనే ఆనాటి పాలకులకు ఒకింత చిన్నచూపే.

తెలంగాణ ప్రతీక అయినా బతు కమ్మ, బోనాలనూ చులకనగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతం లేకపోతే తెలంగాణ వాళ్లకు బతుకుదెరువు లేదు.. బతకడమూ రాదన్నారు. మాట్లాడి తే హేళన చేశారు. కళలకు, కళాకారులకు, తెలంగాణ సాహిత్యానికి అసలు గుర్తింపే లేదు. అన్ని విధాలా అన్యాయానికి గురైన తెలంగాణ గొంతెత్తి, ఉద్యమించి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో పోరాటం చేసి స్వరాష్ట్రా న్ని సాధించుకున్నది.

కానీ తెలంగాణకు కావాల్సింది కేవ లం అస్తిత్వం మాత్రమే కాదని, ఆత్మ గౌరవం కూడా కావాలని ప్రస్తుతం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి దశాబ్దానికి పైగా అవుతున్నప్పటికీ ఇంకా రాష్ట్రంలో ఆంధ్ర పాల కుల ఆలోచనలే ఆచరణలో ఉన్నాయనే అనుమానం వ్యక్తం అవుతున్నది. దీనికి ప్రధాన కారణం నాడు తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన ఎస్పీ బాల సుబ్రమ ణ్యం విగ్రహాన్ని తెలంగాణ సాహితీ ప్రతీక, తెలంగాణ కళా నిలయమైన రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడమే.

నాటి అణచి వేత, అన్యాయం అస్తిత్వ పోరాటానికి దారి తీస్తే.. నేటి అనాలోచిత నిర్ణయం మరో ఆత్మగౌరవ పోరాటానికి దారి తీస్తుంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా సాహిత్య కారులు, కళాకారులు, తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నప్పటికీ రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పై సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు భాష, యాస, సంస్కృతికి న్యాయం చేయాలన్న దృఢ సంకల్పమే మలి దశ తెలంగాణ ఉద్యమానికి పునాది. కానీ ప్రస్తుతం అదే గడ్డపై ఆంధ్ర ప్రాంత ప్రముఖుల విగ్రహాల ప్రతిష్ఠాపన మళ్లీ చర్చకు దారి తీస్తోంది.

రోశయ్య విగ్రహంతో మొదలై..

అనాడు తెలంగాణాలో ఇక్కడి ప్రముఖుల విగ్రహాలకు సరైన స్థానం ఇవ్వలేదని వివా దం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  కాం గ్రెస్ ప్రభుత్వం లక్డీకాపూల్‌లో మాజీ సీఎం  రోశయ్య విగ్రహం ఆవిష్కరించినప్పుడే తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇప్పుడు రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్ర హం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు, మరోవైపు అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పె డుతామని సీఎం, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

రాష్ర్ట విభజన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వారి విగ్రహాలు ఏర్పాటు చేయడమేంటన్న ప్రశ్నలు ఇక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతున్నా యి. బాలసుబ్రహ్మణ్యం సమైక్యవాదాన్ని కోరుకున్నారని అందుకే జయ జయహే తెలంగాణ పాటను పాడలేదని విమర్శ ఉంది. ఇదిలా ఉండగా కళాకారులకు కుల, ప్రాంతీ య భేదాలు అంటగట్టడం ఏంటని ఇరు రాష్ట్రాల కళాభిమానులు అంటున్నారు. 

ట్యాంక్ బండ్ పైనా వాళ్లవే... 

తెలుగు వాళ్లను ఏకం చేయడానికి ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లో 1980లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున, ట్యాంక్ బండ్ రోడ్డు వెంబడి తెలుగు ప్రముఖుల విగ్రహాలను పెట్టారు. వీరంతా సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఇందులో ప్రాంతీయ, కుల వివక్షత స్పష్టంగా ఉన్నది. అక్కడ పెట్టిన 33 విగ్రహాలలో 26 ఆంధ్రావారివైతే, తెలంగాణ వా రివి కేవలం 7 మాత్రమే.. ఉద్యమ సమయంలో ఆ విగ్రహాల ధ్వంసం కూడా జరిగింది.

సమైఖ్య పాలనలో తెలంగాణ ఆస్తిత్వంపై దాడి...

సమైఖ్య పాలనలో మొత్తం తెలంగాణపై జరిగిన అన్యాయాలు కేవలం నిధుల కేటాయింపుల వరకే పరిమితం కాలేదు. రాజకీ య, ఆర్థిక, సాంస్కృతిక ‘ఆస్తిత్వంపై దాడి’గా తెలంగాణ సమాజం భావించింది. స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సాహిత్యం కీలక పాత్ర పోషించింది. అయితే సాంస్కృతికంగా తెలంగాణను చిన్నబుచ్చే ప్రయత్నాలు ఆనా టి పాలకులు చేశారు. తెలంగాణ కళాకారులను హేళన చేశారు. తీవ్రంగా అవమానిం చారు. సాహిత్యం, చరిత్ర ఉన్న భాషా అయి నా తెలంగాణ అంటేనే తక్కువ స్థాయి భాష అన్న భావనను కల్పించారు.

సినిమాలు, సీరియళ్లల్లోనూ తెలంగాణ కళాకారులను జోక ర్లుగా చిత్రీకరించారు. తెలంగాణ కళాకారులు ప్రొఫెషనల్స్ కాదు’ అనే ముద్ర వేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడిన కళాకారులకు గౌరవం మాత్రం లభించలేదు. ఉద్యమ సమయంలో బతుకమ్మ పాటలు, పోరాట గీతాలు, జానపద నృత్యాలు, డప్పు కళ, ఒగ్గు కథా గాయకులందరూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో ముందువరుసలో నిల బడ్డారు. తెలంగాణ కళాకారులకు జరిగిన అవమానం.. కేవలం కళపై దాడి కాదు, ఒక ప్రాంతపు సంస్కృతి, ఆత్మగౌరవం, వ్యక్తిత్వంపై దాడి. 

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం అవసరమా..? 

స్వరాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తెలంగాణ కళాకారుల ఆత్మగౌరవం, తెలంగా ణ సంస్కృతికి గౌరవం గురించి ఆలోచించాల్సిన సమయంలో రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అవసరమా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎస్పీబీ గొప్ప కళాకారుడే, భారతదేశం మొత్తం గర్వించే గాయకుడే. వ్యక్తిగతంగా ఆయనకు ఎవరికి వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు.

కానీ రవీంద్ర భారతిని తెలంగాణ కళ, ఆలోచన, జానపదం, భాష, ఉద్యమ కళాకారుల చరిత్రతో ముడిపడిన వేదిక. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడంపైనే తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ కళలను దశాబ్దాల పాటు చిన్నచూపు చూసినా, తెలంగాణ కళాకారులు గుర్తింపు కోసం పోరాడిన అదే వేదికలో ఆంధ్ర ప్రాంత వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆంధ్రలో తెలంగాణ కళాకారులు, రాజకీయ ప్రముఖుల విగ్రహాలేవి?... 

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎంతో మంది రాజకీయ, కళాకారుల విగ్రహాలు ఆవిష్కరించారు. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఒక్క తెలంగాణ ప్రముఖులకు చెందిన విగ్రహమూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ వారి విగ్రహాలే పెట్టుకుని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వారి విగ్రహాలే పెట్టుకుంటే తెలంగాణ ప్రముఖులకు ప్రాధాన్యత లభించేదెప్పుడని ప్రశ్న లు వినిపిస్తున్నాయి.

అయితే ఏపీలో ఇక్కడి వారి విగ్రహాలు లేనప్పుడు తెలంగాణలో ఎందుకు ఆంధ్ర ప్రముఖులకు వేదికలపై స్థానం ఇవ్వాలని అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు, పేర్లు, సాంస్కృతిక గుర్తింపులు ఎక్కడున్నాయి. ఏపీలో పెద్ద మ్యూజియం, కళా కేంద్రం, సంగీత సభలలో తెలంగాణ కళాకారుల వారికి ప్రత్యేక స్థానం ఉందా. తెలంగాణ భాష, యాస, సాంస్కృతిక రూపా లు అక్కడ కనీస గౌరవం పొందుతున్నాయా.

తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారుల పేర్లతో ఏపీలో ఏ రహదారి, చౌరస్తా, ఆడిటోరియం ఉందా అని ప్రశ్నలు వెలువడుతున్నాయి. అలాంటప్పు డు రవీంద్ర భారతిలో, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన వేదికలో తెలంగాణ కళాకారులు గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న సమ యంలో ఆంధ్ర ప్రాంత కళాకారుడి విగ్రహం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

తెలంగాణకు మిగిలిందేమిటి... 

సమైఖ్య పాలనలో తెలంగాణ భాష, యా స, సాహిత్యం, జానపద కళలపై ఎగతాళి జరిగిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సంగీతం, సినిమాలు, టీవీలో కూడా తెలంగాణ యాస ను జోక్ చేయటానికి మాత్రమే వాడిన సందర్భాలు ప్రజలు మరచిపోలేదు. అలాంటి చరిత్ర ఉన్నప్పుడు, తెలంగాణకు చెందినవారికి గౌరవం ఇవ్వని రాష్ర్టం నుంచి వచ్చిన ప్రముఖులకు తెలంగాణలో విగ్రహాలు పెట్టడంపై ప్రజల్లో సహజంగానే ప్రశ్నలను లేవనె త్తుతుంది. 

ఈ ప్రశ్నను రాజకీయంగా కాకుండా భావోద్వేగం, గౌరవం, గుర్తింపు పరంగా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చే వ్యక్తులు, కళాకారులు ఇంకా ఎంతమంది గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. రవీంద్రభారతిలో విగ్రహాలు పెట్టే స్థాయి వ్యక్తులు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. వారి విగ్రహాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడం లో తప్పే లేదు. కానీ కొందరు దీనిని ప్రాంత వివాదంగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయం అని గుర్తించాలి. 

తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర 

కొట్లాడిందే ‘స్వరాష్ట్రం’ కోసమైతే తెలంగాణ గీతంలో ఆ పదాన్నే బాల సుబ్రహ్మణ్యం తీసేయాలన్నారు. తెలం గాణ ఏర్పడి నేను తెలంగాణ సాంస్కృ తిక సారథి చైర్మన్ అయిన తర్వాత బాల సుబ్ర హ్మణ్యం రవీంద్ర భారతిలోని ఆఫీసుకు వచ్చారు. ఉద్యమ సమయం లో తెలంగాణ విషయంలో తాను పొర బడినట్టు ఒప్పుకున్నారు. బాలసుబ్ర హ్మణ్యం గొప్పు గాయకుడే. అందుకే ఆయన విగ్రహం రామోజీ ఫిల్మిం సిటీ లోనో, ఫిల్మ్ నగరలోనో పెట్టుకోవచ్చు. ఎవరూ వ్యతిరేకించరు.

రవీం ద్రభా రతిని చూడగానే తెలంగా ణ కళలు, కళాకారులు గుర్తు లు ఉట్టిపడేలా ఉండాలి. ఎంతో మంది అమరులైన ప్రాంత అస్తిత్వానికి మద్దతు ఇవ్వని వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడే ఎందుకు పెట్టాలి. అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసింది సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే దీని భేషజాలకు వెళ్లకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే చొరవ తీసుకోవాలి. తెలంగాణ కళాకారులు అనేక మంది ఉన్నారు. బాలు విగ్రహ ఏర్పాటును విరమించుకోకపోతే తెలంగాణ ఆగ్రహాన్ని మరోసారి చవి చూస్తారు.

 రసమయి బాలకిషన్, తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్