11-12-2025 12:52:44 AM
తమ అభ్యర్థులకు పీఠం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు
వనపర్తి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడం మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడత ఎన్నికల సంబందించి ఆయా గ్రామాల్లో గురువారం ఉదయం ఓటింగ్ మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి సర్పంచ్ లతో ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలు రానున్నాయి.
నామినేషన్ నుండి ఓటింగ్ కు ఒక్క రోజు ముందు రోజు వరకు ఎన్నికల ప్రచారం ఆయా గ్రామాల్లో వాడి వేడిగా నువ్వా నేనా అన్నట్లుగా జరిగాయి. మేమే గెలుస్తున్నాం అని ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థుల బహిరంగంగానే చెప్పుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద మొత్తం లో ఖర్చు పెట్టాం ఫలితాలు ఎలా వస్తుందో అన్న అనుమానం ఆలోచన తో లోలోపల మదనపడుతున్నారు.
తమ అభ్యర్థులకు పీఠం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలు ..
ఇందిరమ్మ రాజ్యం లో ప్రజా పాలన తో ప్రజల కు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని తాము బలపర్చిన అభ్యర్థులను ఆయా గ్రామాల్లో సర్పంచ్ లుగా గెలిపిస్తే ఆయా గ్రామాల అభివృద్ధి చేయడం తమ పూర్తి బాధ్యత అని అధికార పార్టీ ఎమ్మెల్యే లు ప్రచారం లో ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని సూచించారు.
గత ప్రభుత్వం లో అభివృద్ధి కుంటు పడిందని ప్రజలు అధికార పక్షం వైపు నిలబడి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం ను వేగవంతంగా అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇస్తున్నారు. గడిచిన రెండేళ్ల అభివృద్ధి ని చూసి ప్రజలంతా అధికార పార్టీ వైపు ఉన్నారని అధికార పార్టీ నాయకులు తమ ఆశభావాని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గోగండి అన్న విధంగా తయారు అయ్యిందని అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం అధికారం లోకి వచ్చిందని వచ్చిన తరువాత హామీ లను అమలు చేయకుండా మోసం చేసిందని ప్రతి పక్ష పార్టీల నాయకులు ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం లో ప్రజలకు వివరిస్తున్నారు.
గడిచిన 10 ఏండ్ల కాలం లో అభివృద్ధి చేశామని అవన్నీ మీ కండ్ల ముందు ఉన్నాయని అభివృద్ధి చేయకుండా మోసం చేస్తున్న అధికార పార్టీ కి తగిన బుద్ది చెబుతూ తాము బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను , వార్డు మెంబర్లను గెలిపించాలని ప్రతి పక్ష పార్టీల నాయకులు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అభ్యర్థించారు.
మొదటి విడత ఫలితాలు మిగితా విడతల్లో ప్రభావం..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్, ప్రచారం మంగళవారం సాయంత్రం తో ముగిసింది. గురువారం ఉదయం మొదటి విడత ఎన్నికలకు సంబందించిన ఓటింగ్ ప్రక్రియ, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడత లో అధికార, ప్రతి పక్ష పార్టీల, ఇండిపెండెంట్ అభ్యర్థుల బల బలాలు తేలనున్నాయి.
ఈ నేపథ్యంలో మొదటి విడత లో అధికార పార్టీ అభ్యర్థులు పెద్ద మొత్తం లో సర్పంచ్ లు గెలిస్తే మిగిలిన రెండవ, మూడవ విడతలో ప్రచారం జోరుగా నిర్వహిస్తూ మొదటి విడత విజయం ను చూయిస్తూ ముందుకు సాగాలన్న ఆలోచనలో నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడత ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీ ల అభ్యర్థులు పెద్ద మొత్తం లో ఆయా గ్రామాల్లో గెలిచి విజయాన్ని కైవసం చేసుకుంటే ఆయా విజయాలను చూయిస్తూ రెండవ, మూడవ విడత ఎన్నికల్లో తమ ప్రణాళిక లు రచించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మొదటి విడత ఎన్నికల్లో ఎ పార్టీ పెద్ద మొత్తం లో గ్రామ పంచాయతీ లను కైవసం చేసుకుంటే ఆ ఫలితాల ఎఫెక్ట్ రెండవ, మూడవ విడతల ఎన్నికల్లో పడుతుందని ఆయా పార్టీల నాయకులు, మేధావులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాగా నేటి ఫలితాల ప్రకారంగా ఆయా పార్టీల నాయకులు నువ్వా నేనా అన్నట్లుగా రెండవ, మూడవ ఎన్నికల ప్రచారం లో పాల్గొనున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అభ్యర్థులు భారీ స్థాయిలో ఖర్చు పెట్టె పరిస్థితి ఉంటుందేమోనన్న ఆలోచన లో పడుతారని నాయకులు, మేధావులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.