calender_icon.png 11 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మొదటి విడత పల్లె పోరు

11-12-2025 01:23:57 AM

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్

  1. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం 
  2. మొత్తం 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు 
  3. వీటిలో 396 గ్రామాలు, 9,633 వార్డులు ఏకగ్రీవం
  4. ఓటు హక్కు వినియోగించుకోనున్న 56.19 లక్షల మంది ఓటర్లు 
  5. పోలింగ్ విధులకు లక్ష మందికి పైగా సిబ్బంది
  6. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : తెలంగాణలో మొదటి విడత గురువారం జరిగే సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన ట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలిం గ్ జరగనుందని తెలిపారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కిం పు ప్రారంభమవుతుందని, సర్పంచ్ ఫలితం తేలిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక జరగుతుందని చెప్పారు.

బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కమిషనర్ రాణికుముదిని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి విడతలో 4,236 గ్రామాలు, 37,440 వార్డుల్లో పోలింగ్ జరగనుందన్నారు. తొలి విడత ఎన్నికల్లో 396 గ్రామాలు, 9,633 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ తొలి విడతలో 56,19,430 మంది మొత్తం ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 27,41,070 మంది ఓట ర్లు, 28,78,159 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 201 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకు 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఈ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కమిషనర్ వివరించారు. ప్రతి పోలింగ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్ బరిలో 12,960 మంది, వార్డు సభ్యులుగా 65,455 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఆర్వోలు 3,591, పోలింగ్ సిబ్బంది 93,905 మంది, మైక్రో అబ్జర్వర్లు 2,489 మంది (మూడు దశలు ) సిబ్బంది పాల్గొననున్నారని కమిషనర్ వివరించారు.

వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు 3,461 ఉండగా, బ్యాలెట్ బాక్సులు 45,086 అందుబాటులో ఉన్నాయని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో 18 రకాల ఐడీ కార్డులను అందుబాటులో ఉంచామని, వీటిలో ఏ రకమైన ఐడీ కార్డును పోలింగ్ బూత్ అధికా రులకు చూపించినా ఓటు వేయవచ్చని కమిషనర్ చెప్పారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 50 వేల మంది సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారని, 60 ప్లటూన్స్ బృందాలు బయటి నుంచి వచ్చాయన్నారు. ఇప్పటీ వరకు తనిఖీల్లో రూ. 8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు. మంగళవారం నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులన్ని మూసివేసినట్లు చెప్పారు. కలెక్టర్లకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. రెండో విడతలో 495 గ్రామాలు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. 

బందోబస్తు : డీజీపీ శివధర్‌రెడ్డి

రాష్ర్టంలో గురువారం జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, అల్లర్లకు ప్రయత్నిం చినా కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ర్టవ్యాప్తంగా 3,800కు పైగా గ్రామ పంచాయతీలు, 37,000 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు 3,000కు పైగా పంచాయతీల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్  ఏర్పాటు చేశామన్నారు.