calender_icon.png 5 August, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో పొన్నం క్యాంప్ ఆఫీస్ షురూ

05-08-2025 01:05:00 AM

  1. కిటుంబ సభ్యులతో కలిసి పూజలు ప్రజాసమస్యల పరిస్కారం కోసమే అన్న మంత్రి

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకుంటామని వెల్లడి

కరీంనగర్, ఆగస్ట్04(విజయక్రాంతి); నగరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన మినిస్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభమైనది.ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రా రంభించిన కార్యాలయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన మం త్రికుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించి న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ .

ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూతెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉం డాలి కనుక హుస్నాబాద్ శాసనసభ్యునిగా, కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యునిగా, లోక్ సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్నటువంటి కార్యాలయం కొంత ఇబ్బందికరం గా ఉన్న కారణంగా నూతన కార్యాలయాన్ని నిర్మించి నట్లు తెలిపారు.

ప్రజల సేవల కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రారంభించిన ఈ కార్యాలయం నుండి లోక్ సభ నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పరిష్కారంతోపాటుగా అభివృద్ధికి సంబంధించి కా ర్యాలయంలో సిబ్బందితో సహా ఆర్జీలు, వి జ్ఞాపన పత్రాలు, సీఎం సహాయనిధి ఇతర దరఖాస్తుల స్వీకరణ మరియు ప్రభుత్వ సం క్షేమ పథకాల సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఈ కార్యాల యం అన్ని రకాలుగా వేదికగా ఉంటుందని ప్రజలందరూ ఈ కార్యాలయాన్ని వినియోగించుకోవాలని కోరారు.ప్రజాపాలన ప్రభు త్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ తెలంగాణ శాసనసభలు చేసిన చట్టాన్ని గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లిన బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ బీసీ నేతలు , అన్ని రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి రావడానికి ఢిల్లీ వెళ్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకుంటామని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ఎలా ఉద్యమం చేశామో.. ఇప్పు డు కూడా ప్రభుత్వం తీసుకున్న గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.కేంద్రం లో ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మంత్రు లు బీసీ ప్రజా ప్రతినిధులు సానుకూలంగా కార్యాచరణ తీసుకొని ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో కరీంనగర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు , జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు ఆకారపు భా స్కర్ రెడ్డి, పడాల రాహుల్, గడ్డం విలాస్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్, శ్రీమతి.కర్ర సత్య ప్రసన్న రెడ్డి, మడుపు మోహన్, మల్యాల సుజిత్, యం. డి.తాజ్, శ్రావణ్ నాయక్, బోనాల శ్రీనివాస్, కంకణాల అనిల్ కుమార్, ఎస్. ఎ మోసీన్, ముద్దం తిరుపతి,ఎస్.ఎల్, గౌడ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఆకుల ప్రకాష్, పడిశెట్టి భూమయ్య, కట్ల సతీష్ తదితరులుపాల్గొన్నారు.

సీతా రామ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం 

కరీంనగర్ క్రైం,ఆగస్టు4(విజయక్రాంతి) కరీంనగర్‌నగరంలోని భగత్ నగర్ హరి హ ర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో దాత ల సహకారంతో 19 లక్షల రూపాయలతో నిర్మించిన సీతా రామ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ప్రారంభించారు. పేదలకు అనుకూలంగా ఉండే విధంగా స్వల్ప నామమాత్రపు రుసుం చెల్లించి

వేడుకలు నిర్వ హించుకునే విధంగా ఆలోచన చేయడం అ య్యప్ప స్వామి దీక్షా కాలంలో స్వాములు భి క్ష చేయడానికి గతంలో ఉన్న ఇబ్బందులను తొలగించి అన్ని సౌకర్యాలతో కళ్యాణ మండపాన్ని నిర్మించడం పట్ల ఆలయ చైర్మన్ యా గండ్ల అనిల్ కుమార్ ను, ఆలయ ఈఓ కాం తా రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు, భక్తులకు దాతలకు అయ్యప్ప స్వామి దీవెన లు ఉండాలని కోరుకుంటున్నానని అన్నా రు.

కాంగ్రెస్ నేత, కొహెడ మండల మాజీ ఎంపీ రాచకొండ చక్రధర్ ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో అయ్యప్ప స్వామి ఆల య మండపం పునర్ నిర్మాణం చేపడుతున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే రెం డు ఉప ఆలయాలు నిర్మించడం జరిగిందని ఈ నెల 14న ఆంజనేయ స్వామి, శ్రీ కృష్ణ భగవానుని విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం జ రుగుతుంది అని చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గారు తెలిపారు.

కార్యక్రమంలోగద్ద ర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, కాం గ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు, పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ, కృష్ణ, ఆనం ద రెడ్డి, కవిత శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, పడాల రాహుల్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, ఆకారపు భాస్కర్ రెడ్డి, ముద్దం తిరుపతి, కంకణాల అనిల్ కుమార్,

బోనాల శ్రీనివాస్, మల్యాల సుజిత్ కుమా ర్, శ్రీమతి కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, శ్రీమతి రజిత రెడ్డి, ఆకుల ప్రకాష్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పొన్నం శ్రీనివాస్, పడాల స్వామి గౌ డ్, కటకం వెంకటరమణ, కంబాల రాజ్ కు మార్, పడిశెట్టి భూమయ్య, ఆకుల నరస య్య, కృపా సాగర్, ఉప్పరి విశాల్, ఉప్పరి రవి, శ్రీమతి గందె కల్పన, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, కట్ల సతీష్, ఆకుల ఉదయ్, తదితరులుపాల్గొన్నారు.