27-12-2025 03:49:30 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): నూతన సర్పంచులు గ్రామాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.ఇటీవల జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మండలంలోని సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేలును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గ్రామాల సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు,నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చేస్తూ, ప్రజల సమస్యలల్లో ముందుండి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేష్ నాయక్, మాజీ సర్పంచ్ లూనావత్ రవీందర్ నాయక్, నాయకులు రవి నాయక్, భద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.