05-01-2026 12:00:00 AM
ఏర్గట్ల, జనవరి 4 (విజయక్రాంతి): ఏర్గట్ల మండలం లోని బట్టా పూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్ స్థానిక రేషన్ షాప్‌లో తీసు కున్న బియ్యం బస్తాలను లబ్ధిదారుల ఇంటికి వాహనం ద్వారా చేర్చే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్యానల్ సభ్యులను గెలిపించి తనను ఉపసర్పంచ్చేస్తే గ్రామంలో రేషన్ షాప్ లో జొకి తీసుకున్న రేషన్ బియ్యం బస్తలను ప్రతి ఇంటికి వాహనం ద్వారా అందజేస్తుని హామీ ఇచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చే భాగంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్లు అయన తెలిపారు. దీనితో పాటు ఇచ్చిన పలు హామీలను ఒక్కోటి గా నెరవేరుస్తూ గ్రామ ప్రజలకు అందుబా టులో ఉంటూ తన సేవాలాందిస్తానని ఉపసర్పంచ్ దయానంద్ అ న్నారు. దీనితో గ్రామ ప్రజలు ఆయనను అభినందనలు తెలిపారు.